Kadiri Real Estates

22 February

తీరు మారి …… అభివృద్ధి వైపు కది(లి)రి….

నేలకు దిగిన రియల్ ఎస్టేట్ ధరలు! కదిరిలో రియల్ ఎస్టేట్ ధరలు చూసి ఇల్లు కట్టుకోవాలి అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా భయపడే పరిస్థితి ఉండేది. ఎందుకంటే కొంతమంది రాజకీయం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే నాయకులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కలసి భూముల ధరలు పెంచి కోట్లు కొల్లగొట్టారు. కదిరిలో కనీసం వంద మందికి ఉపాధి ఇచ్చే ఒక్క పరిశ్రమ లేకున్నా భూముల ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే వీళ్లు చేసిన పాపమే. చాలా మంది చోటా మోటా నాయకులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి పట్టాలు పేదలకు అమ్మి లక్షలు,కోట్లు సంపాదించారు. ఇంకా కొంత మంది రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి పక్కన ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని కూడా కలుపుకొని కొన్ని కోట్లు సంపాదించారు.

Kadiri Real Estates

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎం ఎల్ ఏ కందికుంట ప్రసాద్ కదిరిలో జరుగుతున్న భూ ఆక్రమణల పై చర్యలకు ఉపక్రమించారు. అప్పుడు భూ అక్రమార్కులు అందరూ కలసి సమావేశం ఏర్పాటు చేసుకొని అందరం కలసి ఎం ఎల్ ఏ ని కలసి “సంధి” చేసుకుందాం అని నిర్ణయించుకున్నారు. కానీ ఎం ఎల్ ఏ కందికుంట కనీసం వారిని ఇంటి గడప కూడా తొక్కనీయలేదు. వాళ్ళు మాత్రం ప్రయత్నాలు ఆపకుండా ఎం ఎల్ ఏ కి డబ్బు ఇవ్వడానికి కూడా బలంగా ప్రయత్నించారు. కొన్ని కోట్ల రూపాయలు డబ్బు ఇస్తాం అని ఎం ఎల్ ఏ పక్కన ఉండే వారి ద్వారా ఎం ఎల్ ఏ కి చెప్పించారు. అప్పుడు ఎం ఎల్ ఏ మీరు ఇటువంటవి నా దగ్గరికి తీసుకొని వస్తే మీరు కూడా నా దగ్గరికి రాకండి అని గట్టిగా మందలించారు

త్వరలో కదిరికి పరిశ్రమలు! కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి చాలా అనువైన స్థలాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇంతకు ముందు ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ కందికుంట గెలిచిన వెంటనే కదిరిలో ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని ఇప్పటికే చాలా మంది పారిశ్రమవేత్తలను కలిసి అందుబాటులో ఉన్న వనరుల గురించి వాళ్లకి వివరించి వాళ్ళను ఒప్పించారు. త్వరలో కదిరికి పరిశ్రమలు వస్తాయని కదిరి ప్రజలు మాట్లాడుకుంటూ కదిరి కోసం కందికుంట చేస్తున్న కృషిని ప్రశంసించారు. కదిరి యువతకు త్వరలో మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఎం ఎల్ ఏ ను అభినందించిన టీడీపీ అధిష్టానం. కదిరి అభివృద్ధి కోసం, కదిరిలో భూ ఆక్రమణల పై ఎం ఎల్ ఏ తీసుకుంటున్న చర్యలను టీడీపీ అధిష్టానం అభినందించింది. కదిరి అభివృద్ధికి అవసరమైన ప్రభుత్వ నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎం ఎల్ ఏ కి చెప్పారు.

జాడలేని ప్రతిపక్షం. కదిరి నియోజకవర్గంలో ప్రతిపక్షం ఎక్కడా కనిపించడం లేదు. నిర్మాణాత్మక సలహాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎం ఎల్ ఏ చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ప్రజల నుంచి ఎం ఎల్ ఏ కి వస్తున్న సానుకూల స్పందన చూసి వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. అసలు కదిరిలో ప్రతిపక్షం ఉందా అని ప్రజలు అడుగుతున్నారు